హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
చుక్కన్నగారి వెంకట్ రెడ్డి మృతి - పద్మదేవేందర్ రెడ్డి పరామర్శ JH-55207

జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా హవేలీ ఘణపూర్ మండల పార్టీ అధ్యక్షులు చుక్కన్నగారి శ్రీనివాస్ రెడ్డి తండ్రి చుక్కన్నగారి వెంకట్ రెడ్డి బుధవారం మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ విషయం నాయకులు ద్వారా తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మదేవేందర్ రెడ్డి గురువారం బ్యాతోల్ గ్రామానికి చేరుకుని శ్రీనివాస్ రెడ్డిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు.

రెండు నెలల క్రితమే శ్రీనివాస్ రెడ్డి తల్లి లలిత మృతి చెందగా, ఇప్పుడు తండ్రి కూడా మృతి చెందడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరై తమ సంతాపాన్ని తెలియజేశారు. వీరి వెంట మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం. అంజ గౌడ్, మాజీ సర్పంచ్, యామి రెడ్డి, నాయకులు కొంపల్లి సుభాష్ రెడ్డి, కిష్టయ్య, యాదగిరి తదితరులు ఉన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
చుక్కన్నగారి వెంకట్ రెడ్డి మృతి - పద్మదేవేందర్ రెడ్డి పరామర్శ
చుక్కన్నగారి వెంకట్ రెడ్డి మృతి - పద్మదేవేందర్ రెడ్డి పరామర్శ

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌