మాదిగలకు 11% రిజర్వేషన్లు ఇవ్వాలి.. ఎంఆర్పిఎస్ గట్టి డిమాండ్
Published on 18 Apr 2026, 12:18 AM 5
JH-70132
జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా తుప్రాన్ మండలం కేంద్రంలో ఎమ్మార్పీఎస్ సమావేశంలో రాష్ట్రంలో జనాభా జనాభా కనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. తూప్రాన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు యాదగిరి మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ గతం నుండి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ 9% కాదు 11% కావాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమాన్ని ఉధృతం చేసి వర్గీకరణ సాధించుకుందాం.
ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ గారు గతంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా మాదిగలదని జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు కానీ ప్రభుత్వం తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎస్సీలను వర్గీకరించింది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే కుల గణనా సర్వే నిర్వహించిన సర్వేలో మాదిగల జనాభా అత్యధికంగా ఉందని ప్రభుత్వమే లెక్కలు తేల్చిందని దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని మరొక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం మాకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కేటాయిస్తేనే న్యాయం జరుగుతుందని లేనిపక్షంలో మా జాతికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నాం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా శాతాన్ని పెంచి న్యాయం చేయాలని లేని పక్షంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరోసారి ఉద్యమించక తప్పదని హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు ఉషన్న, గళ్ళ మురళీ మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి తాడేపు మహేందర్, ఎరుపుల పరమేష్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు, మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పల్లెపాటి మాధవి మాదిగ, ఢిల్లీ పుష్ప మాదిగ, సీనియర్ నాయకులు సరిగల్ల నరసింహులు మాదిగ, శివొళ్ల భాస్కర్ మాదిగ, కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
