శమ్నాపూర్‌లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహణ
Published on 05 Apr 2026, 12:08 PM 63
JH-26372
జనహితం న్యూస్, మెదక్ రూరల్ ఏప్రిల్ 05: శమ్నాపూర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో బాబు జగ్జీజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పట్నం నాగరాణి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త భారతదేశానికి విశేష సేవలను అందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఆమె అన్నారు. పంచాయతి కార్యదర్శి డాక్టర్ యాదగిరి మాట్లాడుతూ గొప్ప సంఘసంస్కర్తగా తన పరిపాలనదక్షతో అఖండ భారత విశేష సేవలు అందించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు.
జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీ తరపున కార్మిక శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన గణత ఈ గొప్ప నాయకునికి దక్కింది అని అన్నారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కొత్త చట్టాలను కార్మికులకుప్రవేశపెడుతూ వారి అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చరిత్రలో నిలిచారన్నారు.
ఇటువంటి గొప్ప మహనీయుల ఆయన జయంతి రోజున తలుచుకోవడం అదృష్టంగా భావించాలి అలాగే నేటితరం యువత ఆయన బాటలో నడుస్తూ ఆయన సూచన ఆయన చేసినటువంటి పనులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అలాంటి గొప్ప యోధుడికి గొప్ప సంఘసంస్కర్తకి ఇవే మా మనసుమంజూలు ఇట్టి జయంతి కార్యక్రమం లో పాల్గొన్న గ్రామ పంచాయితీ వార్డు మెంబర్ లు, పిల్డ్ అసిస్టెంట్ దశరథం, విద్యుత్ లైన్ మెన్ వేంకటేష్, బాల్ రాజు, శ్యామ్, గ్రామ పంచాయితీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
