మెదక్ గోల్కొండ వీధిలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
Published on 05 Apr 2026, 12:25 PM 53
JH-49718
జనహితం న్యూస్, మెదక్ రూరల్ ఏప్రిల్ 05: మెదక్ పట్టణంలో గల గోల్కొండ వీధిలో బాబు జగ్జీజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇట్టి కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం కార్యవర్గ సభ్యుడు గిద్దెక్కింది ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త భారతదేశానికి విశేష సేవలను అందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప సంఘసంస్కర్త గా తన పరిపాలనదక్షతో అఖండ భారత విశేష సేవలు అందించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీ తరపున కార్మిక శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన గణత ఈ గొప్ప నాయకునికి దక్కింది.
కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కొత్త చట్టాలను కార్మికులకుప్రవేశపెడుతూ వారి అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చరిత్రలో నిలిచారన్నారు. ఇటువంటి గొప్ప మహనీయులు ఆయన జయంతి రోజున తలుచుకోవడం అదృష్టంగా భావించాలి అలాగే నేటితరం యువత ఆయన బాటలో నడుస్తూ ఆయన సూచన ఆయన చేసినటువంటి పనులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అలాంటి గొప్ప యోధుడికి గొప్ప సంఘసంస్కర్తకి ఇది మా మనసుమంజూలు ఇట్టి జయంతి కార్యక్రమం లో పాల్గొన్న బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం నాయకులు లక్ష్మణ్, కుమార్, ప్రభాకర్, ఎస్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
