హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
మెదక్‌లో ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు JH-70033

జనహితం న్యూస్, మెదక్ రూరల్ ఏప్రిల్ 05: మెదక్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ 27వ వార్డు ఇంచార్జీ గిద్దకింది ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ పట్టణం నందు గోల్కోండ వీధిలో ఉన్న విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం, ఆయన దేశానికి, సమాజానికి చేసిన అపార సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.., డా. బాబు జగ్జీవన్ రామ్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం యుగయుగాల పాటు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. అలాగే, ఆయన ఆశయాలను యువత మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళలాని అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని సంకల్పం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గిద్దకింది ప్రవీణ్ కుమార్, లక్ష్మన్, కూమార్, బంటు, సురేష్, రోహిత్, నాగేంద్ర, చిరంజీవి మరియు తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
మెదక్‌లో ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు
మెదక్‌లో ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌