హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
విద్యా కమిషన్ నివేదిక అశాస్త్రీయమైందని విమర్శలు – తపస్ నేత పెంటయ్య వ్యాఖ్యలు JH-34123

జనహితం న్యూస్, మెదక్ రూరల్ మార్చి 26: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని సత్యనారాయణ స్వామి కళ్యాణ మండపంలో విద్యా కమిషన్ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన, తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య మాట్లాడుతూ ఆకునూరి మురళి ఇచ్చినటువంటి విద్యా కమిషన్ నివేదిక అశాస్త్రీయమైనదని, అనైతికమైనది వారు అన్నారు. విద్యా కమిషన్ చైర్మన్ సభ్యులు ఎవరిని అడిగి నివేదిక రూపొందించారని, ఎంతమంది ఉపాధ్యాయులు కలిశారని, ఎంతమంది తల్లిదండ్రులను కలిశారని వారు కమిషన్ ప్రశ్నించారు. కమిషన్ లో ఉన్నటువంటి చాలా అంశాలు అభ్యంతరకరమని, కమిషన్ ప్రతిపాదించినట్లు బడ్జెట్ లో 18% కేటాయించాలని ఇచ్చినప్పటికీ రాష్ట్ర బడ్జెట్ ఎంత శాతం కేటాయించిందో మనకు తెలుసు అని వారు అన్నారు. అంటే ప్రభుత్వమే నియమించిన విద్యా కమిషన్ మీద నమ్మకం లేనప్పుడు, ఉపాధ్యాయులకు సంబంధం లేకుండా, తల్లిదండ్రులకు సంబంధం లేకుండా, వారి సొంత భావాలను జోడించు రూపొందించడం ఎంతవరకు సమంజసమని, వెంటనే ప్రభుత్వం విద్యా కమిషన్ నివేదిక రద్దు చేయాలని వారన్నారు.

ఈ కార్యక్రమంలో తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, జాల సిద్దూ,తపస్ రాష్ట్ర బాధ్యులు దుబాషి భాస్కర్, చల్లా లక్ష్మణ్, రంగా రెడ్డి,ఆర్ వి రామారావు,మన్నే వెంకట్ స్వామి, ఎస్ టి యు టి ఎస్ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్, మన్నె సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి బాబా, సోషల్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు తిరునగిరి నర్సింలు, జీవశాస్త్ర మెదక్ జిల్లా ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, తపస్ మహిళా అధ్యక్షురాలు స్వరూప రాణి, తపస్ పూర్వ అధ్యక్షులు రాగి రాములు, దత్తాత్రేయ కులకర్ణి,తపస్ జిల్లా, మండల బాద్యులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
విద్యా కమిషన్ నివేదిక అశాస్త్రీయమైందని విమర్శలు – తపస్ నేత పెంటయ్య వ్యాఖ్యలు
విద్యా కమిషన్ నివేదిక అశాస్త్రీయమైందని విమర్శలు – తపస్ నేత పెంటయ్య వ్యాఖ్యలు

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌