హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
భగత్ సింగ్, రాజగురు, సుకదేవ్ ల 95 వ వర్ధంతి సందర్భంగా CITU రక్తదాన శిబిరం. JH-96234

జనహితం న్యూస్ మెదక్ రూరల్ మార్చి 26: స్వాతంత్ర్య ఉద్యమ అమరవీరులు భగత్ సింగ్, రాజగురు సుకదేవ్ 95 వ వర్ధంతి సందర్భంగా C. I.T.U, వ్యవసాయ కార్మిక సంఘం, S.F.I, D.Y.F.I సంఘాల ఆధ్వర్యంలో మెదక్ కేవల్ కిషన్ భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని రిటైర్డ్ టీచర్ కొండల్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొండల్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత భగత్ సింగ్, రాజగురు సుకదేవ్ ల స్పూర్తిగా పెట్టుబడి దారి వ్యవస్థను, సామ్రాజ్యవాద దోపిడీని ఎదిరించడానికి నడుము బిగించాల్సిన అవసరం ఉందని అన్నారు. 23 సంవత్సరాల అతి చిన్న వయస్సులో భగత్ సింగ్ దేశం కోసం ఉరికంబం ఎక్కారని కొనియాడారు. 12 సంవత్సరాల వయస్సు లోనే భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఆకర్షితుడు అయి అనాడే బ్రిటీష్ సామ్రాజ్యవాద దోపిడి తో పాటు దేశంలోని పెట్టుబడిదారి వ్యవస్త ను, సామాజిక దోపిడీని ఎదిరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారని అన్నారు.

నేడు భారత దేశంలో కూడ సామాజిక ,ఆర్థిక దోపిడే బ్రిటిష్ కాలం మాదిరిగానే కొనసాగుతుందని అన్నారు. నాడు బిటిష్ వ్యతిరేక పోరాటంలో కీలక సమయాల్లో స్వాతంత్ర్య ఉద్యమ నాయకుల్లో కొందరు బ్రిటిష్ అనుకూల వైఖరి తీసుకోగా నాడు భగత్ సింగ్ లాంటి నాయకులు ఆ పద్ధతులను విభేదించి పోరాడినారన్నారు. నేడు కూడా దేశంలో పరిపాలకులు సామ్రాజ్యవాదంతో రాజీ వైఖరి అవలంబిస్తున్నందున నేటి యువత, ప్రజానీకం సామ్రాజ్య వాదాన్ని ఎదిరించే పోరాటం నడాపాల్సిన అవసరం ఉందన్నారు.

నేడు ప్రపంచంలో సామ్రాజ్య వాద కాంక్ష తో కొనసాగుతున్న యుద్ధం వల్ల మన దేశంలో గ్యాస్ కొరత, పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందన్నారు. దీని ప్రభావం పిల్లల హాస్టల్స్, క్యాంటిన్స్, హోటల్స్ మూత పడే పరిస్తితి వచ్చిందన్నారు. ఈ సామ్రాజ్య వాద యుద్ధం ఇలానే కొనసాగితే నిత్యవసర సరుకుల కొరత, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభానికి దారి తీస్తుందన్నారు. నాటి స్వాతంత్ర్య పోరాట అమరుల స్పూర్తిగా దేశంలో ఉద్యమాలు నడపాల్సిన అవసరం ఉందని అన్నారు.

అమరుల స్పూర్తిగా C.I.T.U ఇతర ప్రజాసంఘాల ఈ రక్తదాన కార్యక్రమం ఎందరో పేదలకు ఉపయోగ పడుతుందని కొనియాడారు. ఈ రక్తదాన శిబిరం నిర్వహించిన సంఘాలను, రక్త దాతలను కొండల్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో C.I.T.U జిల్లా కార్యదర్శి A.మల్లేశం, కోశాధికారి K.నరసమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి K.మల్లేశం, వివిధ సంఘాల నాయకులు గౌరయ్య, సంతోష్, గణేశ్వరెడ్డి, నరేందర్, కవిత, వెంకట్, పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి రక్త నిధి సిబ్బంది, డాక్టర్స్ పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
భగత్ సింగ్, రాజగురు, సుకదేవ్ ల 95 వ వర్ధంతి సందర్భంగా CITU రక్తదాన శిబిరం.
భగత్ సింగ్, రాజగురు, సుకదేవ్ ల 95 వ వర్ధంతి సందర్భంగా CITU రక్తదాన శిబిరం.

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌