పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి – ఎమ్మెల్సీ మల్కా కొమరయ్యకు తపస్ విజ్ఞప్తి
Published on 04 Apr 2026, 04:25 PM 35
JH-16920
జనహితం న్యూస్, మెదక్ రూరల్: పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, పెండింగ్ డిఏల మంజూరు, పిఆర్సి ప్రకటన వంటి సమస్యల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీ శ్రీ మల్కా కొమరయ్య ను కోరిన తపస్ మెదక్ జిల్లా నాయకులు. ఈ కార్యక్రమంలో తపస్ మెదక్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జిడ్డి ఎల్లం, జాల సిద్దు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి దుబాషి భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెతుకుపల్లి రంగారెడ్డి, చల్లా లక్ష్మణ్, సంగారెడ్డి మెదక్ సిద్దిపేట జోనల్ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కోశాధికారి భాస్కర్ దేష్ గారు పాల్గొన్నారు.
