ముంబైలో ఏప్రిల్ 7న ఎమ్మార్పీఎస్ సమావేశం – మెదక్ నేతల పిలుపు
Published on 26 Mar 2026, 12:49 PM 24
JH-19521
జనహితం న్యూస్, మెదక్ రూరల్ మార్చి 26: మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం రోజున ఏప్రిల్ 7న ముంబైలో జరుగు ఎంఆర్పిఎస్ జాతీయ కార్యవర్గ సమావేశానికి మెదక్ జిల్లాలోని ప్రతి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు రావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చేట్లపల్లి యాదగిరి మాదిగ పిలుపునిచ్చారు. ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు చేట్లపల్లి యాదగిరి మాదిగ,అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా సినియర్ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ,ఉశన్నగల్ల మురళి మాదిగ,జిల్లా అద్యక్షులు చేట్లపల్లి యాదగిరి మాదిగ హాజరై మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ఏప్రిల్ 7న ముంబైలో జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని.
ఆ జాతీయ కమిటీ సమావేశంలో ఎమ్మార్పీఎస్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఇంకా వర్గీకరణ అమలు కానీ రాష్ట్రాలలో వర్గీకరణ అమలుకై ఎమ్మార్పీఎస్ పోరాటాన్ని ఉదృతం చేయడం కోసం మరియు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దేశంలో దళితులపై జరుగుతున్న దాడుల విషయం మరియు ప్రజా సమస్యల పైన మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో దేశంలో మిగిలి ఉన్న ప్రజా సమస్యల పైన చర్చించడం జరిగి భవిష్యత్ కార్యాచరణ మందకృష్ణ మాదిగ జాతీయ కమిటీ సమావేశంలో ప్రకటిస్తారని తెలియజేశారు. ఈ యొక్క జాతీయ కమిటీ సమావేశానికి మెదక్ జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుండి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ఏప్రిల్ 7న జరుగు జాతీయ కమిటీ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు చేట్లపల్లి యాదగిరి మాదిగ, వర్కింగ్ ప్రెసిడెంట్ అస్రగల్ల బాల్ రాజు మాదిగ, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లిశేట్టి రవి మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి ఎన్నేల్లి సుధాకర్ మాదిగ, ఉపాధ్యక్షులు పరమెష్, ఎల్లేష్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పల్లేపాటి మాదవి మాదిగ, ప్రధాన కార్యదర్శి పుష్ప మాదిగ,మరియు తదితరులు పాల్గొన్నారు.
