యాదాద్రిలో పద్మ దేవేందర్ రెడ్డి గిరిప్రదక్షిణ – భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
Published on 31 Mar 2026, 06:24 PM 7
JH-27282
జనహితం న్యూస్, మెదక్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఏం పద్మ దేవేందర్ రెడ్డి గిరిప్రదక్షిణ నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆమెతో పాటు కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తుల. ఉమా,ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ చేసిన అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యే పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతుండగా, పద్మ దేవేందర్ రెడ్డి సాధారణ భక్తుల్లా గిరిప్రదక్షిణలో పాల్గొని తన ఆధ్యాత్మిక భక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.... శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సమయానికి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి నెలకొనాలని ప్రార్థించినట్లు తెలిపారు.యాదాద్రి క్షేత్రం బిఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెంది దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని పేర్కొన్నారు.
