హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
పాపన్నపేటలో బాధిత కుటుంబాలకు అండగా పద్మదేవేందర్ రెడ్డి JH-67035

జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిత్రియల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సులోచన భర్త, రిటైర్డ్ టీచర్ బైరి రాజయ్య ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మదేవేందర్ రెడ్డి సోమవారం బైరి రాజయ్య దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు.

అదేవిధంగా పాపన్నపేటలో పోతదార్ ప్రసాద్ తల్లి మరణించగా, వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఇదే గ్రామానికి చెందిన శివునూరు కుమార్ భార్య మరణించడంతో వారి కుటుంబాన్ని కూడా కలిసి ఓదార్పు తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తాడేపు సోములు, మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ ఏడుపాయల ఛైర్మన్ బాలగౌడ్, మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు కొత్తపల్లి జగన్, మాజీ ఎంపీపీ బచారం దుర్గయ్య, చిత్రియల్ సర్పంచ్ బైరి సురేష్, మాజీ సర్పంచ్ లు గురుమూర్తి గౌడ్, శ్రీనాథ్ రావు, బద్రి మల్లేశం, నాయకులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
పాపన్నపేటలో బాధిత కుటుంబాలకు అండగా పద్మదేవేందర్ రెడ్డి
పాపన్నపేటలో బాధిత కుటుంబాలకు అండగా పద్మదేవేందర్ రెడ్డి

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌