హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
మెదక్‌లో కాంగ్రెస్‌కు షాక్ – BRSలోకి భారీగా చేరిన నేతలు JH-48258

జనహితం న్యూస్ మెదక్ రూరల్ మార్చి 25: మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీసర స్వామి, చాకలి రాములు, కీర్తి స్వామి, గొల్ల స్వామి, కీసర ఆశయ్యతో పాటు పలువురు కార్యకర్తలు పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.వీరికి పద్మా దేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి ఆత్మీయంగా ఆహ్వానించారు. వారికి భవిష్యత్తులో పార్టీ తరఫున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఏ సమస్య వచ్చినా,ఎప్పుడు ఫోన్ చేసినా తాను అందుబాటులో ఉంటానని, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తానని ధైర్యం చెప్పారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలపరచడం ద్వారా విజయాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్, గ్రామ అధ్యక్షుడు సంతోష్, సిద్దయ్య, నాగేశ్వరరావు,నవీన్, సాయిలు, మాల సాయిలు,మస్కూరి సాయిలు,నక్కుర్తి స్వామి, గొల్ల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ సురేష్, దేవేందర్,పర్వతాపూర్ మాజీ సర్పంచ్ స్వామి, కిషన్ తండా మాజీ సర్పంచ్ సుభాష్, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
మెదక్‌లో కాంగ్రెస్‌కు షాక్ – BRSలోకి భారీగా చేరిన నేతలు
మెదక్‌లో కాంగ్రెస్‌కు షాక్ – BRSలోకి భారీగా చేరిన నేతలు

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్