హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
కనీస వేతనం ₹26,000 చేయాలి – సిఐటియు నేతల ఆందోళన పిలుపు JH-25457

జనహితం న్యూస్ మెదక్ రూరల్ మార్చి 23: మెదక్ మున్సిపల్ కార్యాలయంలో రేపు చలో హైదరాబాద్ విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇస్తు ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బందినందరినీ పర్మినెంట్ చేయాలనీ, 2వ పిఆర్సిలో కనీస వేతనం రూ.26,000/-లుగా నిర్ణయించాలని, వివిధ విభాగాలలో పని చేస్తున్న ఉద్యోగ, కార్మికులందరికి డిఏ అమలు చేయాలని, మరణించిన కార్మికుల దహన సంస్కరాలకు రూ.30,000/లు ఇవ్వాలని, ఐఎఫ్ఎంఐఎస్ ఆన్లైన్ పోర్టల్ లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం తదితర సమస్యలను పరిష్కరించాలని అన్నారు.

రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు పిఆర్సిలలో నిర్ణయించిన మినిమమ్ బేసిక్ పేని కనీస వేతనంగా చెల్లిస్తున్న అనవాయితీ ఉంది. కానీ గత ప్రభుత్వం జీవో నెం.60 ప్రకటించినప్పటికీ జీఓలో పేర్కొన్న కేటగిరీల వారీ వేతనాలను మున్సిపల్ కార్మికులకు చెల్లించకపోవడంతో 11వ పిఆర్సి నిర్ణయించిన మినిమమ్ బేసిక్ రూ.19,000/-లు, రూ.22,900/-లు, రూ.31,040/-లను కేటగిరీల వారి వేతనాలు మున్సిపల్ కార్మికులకు అమలు కాలేదని అన్నారు.

కాంగ్రేస్ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామినిచ్చింది. 2 సంవత్సరాలు కావస్తున్నా అమలుకు నోచుకోలేదు. 2వ పిఆర్పి లోనైన కనీస వేతనం రూ.26,000/లుగా నిర్ణయించి కేటగిరీల వారిగా అమలు చేయాలి. వివిధ ప్రభుత్వం శాఖలలోని వారికి అమలు చేస్తున్న విధంగా మున్సిపల్ కార్మికులందరికి డిఏ అమలు చేయాలనీ అన్నారు. రేపు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్మికులందరూ విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి నాగరాజు నాయకులు ఏసు, రాజు, శేఖర్, ఫిరోజ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
కనీస వేతనం ₹26,000 చేయాలి – సిఐటియు నేతల ఆందోళన పిలుపు
కనీస వేతనం ₹26,000 చేయాలి – సిఐటియు నేతల ఆందోళన పిలుపు

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌