ప్రజా సమస్యల వెల్లువ.. మెదక్‌లో వార్డు సభ నిర్వహణ
Published on 02 Apr 2026, 09:04 PM 23
JH-45385
జనహితం న్యూస్, మెదక్ రూరల్: నేడు పట్టణంలోని గోల్కొండ వీధి 27 వార్డులో వార్డు సభ మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ (అందెశ్రీ) గారి గీతలపనాతో ఉదయం 10 గంటల నుండి ప్రారంభించుకోవడం జరిగింది. వార్డు సభ్యులు పెద్దలు యువత మహిళలు అందరూ వచ్చి తమ తమ సమస్యలు ఆసరా పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు, స్థలాల కేటాయింపు, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం, రాజీ వికాస్ యోజన తదితర అంశాలపై లిఖిత పూర్వకంగా రాసి వార్డు ఆఫీసర్ గారికి సమర్పించడం జరిగింది.
అందుకు వారు సానుకూలంగా స్పందించి.. మీరు ఇచ్చిన అర్జీలపై త్వరలో మున్సిపల్ నుండి సర్వే టీం వచ్చి అర్హులను ఎంపిక చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ శ్రీమతి అస్తర్గల్ల పల్లె రాణి-బాల్రాజ్, ప్రోగ్రామ్ ఇంచార్జి నివేద, మాజీ కౌన్సిలర్ మధు, విద్యార్థి నాయకులు కాసాపురం కిరణ్, కొలుపుల నవీన్, రాజంపేట ఈశ్వర్, నాయకులు అరవింద్, సిద్దిరములు, అంగన్వాడీ టీచర్ మంజుల, ఆశావర్కర్ ప్రేమలత రేషన్ డీలర్ ప్రసాద్, మెప్మ ఆర్పి మీనా తదితరులు పాల్గొన్నారు.
