గ్రామ సభల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి: బీఆర్‌ఎస్ నేత పిలుపు
Published on 01 Apr 2026, 10:06 PM 86
JH-95146
జనహితం న్యూస్, మెదక్ రూరల్: ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద రాజ్యమేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేసిందన్నారు, రేపు జరగబోయే గ్రామ సభలలో ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అమలు కానీ 420 హామీలపై, 6 గ్యారెంటీలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గ్రామసభలలో నిలదీసి వైఫల్యం ఎండ కట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను తమ మంత్రులను గ్రామ సభలోకి వెళ్లకుండా, అధికారులతోనే గ్రామ సభలు జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని తెలిపారు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజా పాలన పేరిట వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని మోసం చేసిందని, కళ్యాణ లక్ష్మి లక్ష తో పాటు తులంబంగారం ఇస్తామని చెప్పి మోసం, విద్యార్థినిలకు స్కూటీల పంపిణీ చేస్తామని మోసం చేశారని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
