హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
అచ్చంపేట గురుకులంలో వంటగ్యాస్ సమస్య – విద్యార్థుల ఇబ్బందులు, అధికారులపై ఆగ్రహం JH-29200

జనహితం న్యూస్: నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో నెలకొన్న వంట గ్యాస్ సమస్యను అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించాలని (A.I.S.B) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు భైరపూర్ రవీందర్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా పాఠశాలకు వంటగ్యాస్ సరఫర లేకపోవడంతో విద్యార్థుల మెనూ గాడి తప్పిందన్నారు.గతంలో ఇదే పాఠశాల జుక్కల్ మండల కేంద్రంలో ఉండేదని, అక్కడ వసతులు సరిగా లేకపోవడంతో దాన్ని అచ్చంపేటకు మార్చారని ఆయన గుర్తు చేశారు.

గత ఐదేళ్లుగా ఇండెన్ గ్యాస్ స్థానంలో హెచ్ పి గ్యాస్ సరఫరా చేసిన నిజాంసాగర్ లోని వీరభద్ర ఏజెన్సీ నిర్వాహకుడు ప్రస్తుతం సరఫరా చేయలేనని చేతులెత్తేయడంతో విద్యార్థులకు వంట సమస్య ఏర్పడిందన్నారు. జుక్కల్ ఉన్నపుడు గతంలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి HP ఏజెన్సీ కి మార్పిడి చేస్తే సరఫరా చేస్తానని చెప్పడంతో పాఠశాల నిర్వాహకులు ఈనెల 18న ఏజెన్సీ మార్పిడి పత్రం తీసుకువచ్చారు.

వీరభద్ర ఏజెన్సీ నిర్వాహకుడు మార్పిడి పత్రాన్ని అంగీకరించకపోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా సమస్య తయారైందని పాఠశాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఇండేన్ గ్యాస్ సరఫరా లేక ఇటు హెచ్ పి గ్యాస్ సరఫరా లేక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆయన ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.గత వారం రోజులుగా పాఠశాలలో వంట గ్యాస్ సమస్య ఉన్నా,వివిధ పత్రికల్లో వార్తలు వచ్చినా, ఉన్నతాధికారులు పెడచెవిన పెడుతున్నారని ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు.రెండు రోజుల్లో గ్యాస్ కంపెనీలతో మాట్లాడి సమస్యను పరిష్కరించకుంటే పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, దళిత, బహుజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.

Click to join Whatsapp channel
Janahitham News
అచ్చంపేట గురుకులంలో వంటగ్యాస్ సమస్య – విద్యార్థుల ఇబ్బందులు, అధికారులపై ఆగ్రహం
అచ్చంపేట గురుకులంలో వంటగ్యాస్ సమస్య – విద్యార్థుల ఇబ్బందులు, అధికారులపై ఆగ్రహం

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌