120 మందికి ఒకే టాయిలెట్, ఆగ్రహంతో రోడ్డెక్కిన నర్సింగ్ విద్యార్థులు
Published on 10 Apr 2026, 02:53 PM 98
JH-46793
జనహితం న్యూస్, మెదక్ రూరల్: హాస్టల్‌లో వసతులు బాగా లేవని మెదక్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు రోడ్డుపై ధర్నా. వంద ఇరవై మందికి ఒకే టాయిలెట్.. శుభ్రం చేయకుండా కంపు కొడుతుంది. పాడైన భోజనం పెట్టీ పస్తులు ఉంచుతున్నారు.. గదుల్లో పాములు వస్తున్నా పట్టించుకోవడం లేదు.. అని ఆగ్రహించిన నర్సింగ్ విద్యార్థినిలు రోడ్డెక్కి ఆందోళన చేసిన ఘటన మెదక్ పట్టణంలో శుక్రవారం జరిగింది.
మెదక్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతం. 120 మందికి ఒకే టాయిలెట్ అందులో వెళ్దామన్న శుభ్రం చేయకపోవడం వల్ల కంపు కొడుతుంది. అయినా ఓర్చుకొని ఉన్నా రుచి పచి లేని పాడైన భోజనం పెట్టీ పస్తులు ఉంచుతున్నారు. ప్రతీ విద్యార్థి నర్సింగ్ కోర్సులో చేరేందుకు జాయినింగ్ రుసుము రూ. 20 వేలతో పాటు మెస్ చార్జీ కింద నెలకి రూ. 6 వేలు విద్యార్థుల వద్ద నుంచి వసూలు చేస్తున్నట్టు తెలిపారు. కానీ ప్రతి నెల డబ్బులు తీసుకున్న నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒకే టాయిలెట్‌లో అందరూ వెళితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కనీసం టాయిలెట్‌లు కూడా శుభ్రం చేయించడం లేదని, అపరిశుభ్రత ఫోటోలు చూపించారు.
హాస్టల్‌లో అర్థరాత్రి పాములు వస్తుంటాయని చెప్పినా ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుకున్న కలెక్టర్ ఆందోళన చేస్తున్న విద్యార్థులను బస్సులో కలెక్టరేట్‌కు తరలించి, వారి సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు. విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
