విద్యుత్ కార్మికుల డిమాండ్స్‌పై సమ్మె - సిఐటియు పూర్తి మద్దతు
Published on 08 Apr 2026, 11:02 PM 84
JH-35223
జనహితం న్యూస్, మెదక్ రూరల్: TVAE JAC రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ మరియు ఇతర కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మెదక్ విద్యుత్ యస్, ఈ ఆఫీస్ వద్ద జరుగుతున్న సమ్మె కు సీఐటీయూ మెదక్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుది. ఈ సందర్భంగా సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో సంస్థను నమ్ముకొని దాదాపు 20, 25 సంవత్సరాల నుండి ఆర్టిజన్స్ పనిచేస్తున్నారని.
గత ప్రభుత్వం ఈ సంస్థలో 23667 ఆర్టిజన్స్ ను ఈ సంస్థలో విలీనం చేసుకోవడం జరిగిందని కానీ విద్యుత్ సంస్థ పుట్టినప్పటి నుండి apseb ఒకటే రూల్స్ అమలు జరుగుతుందని ఈ రూల్ కాకుండా స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం ఆర్టిజన్స్ ఈ సంస్థలో విలీనం చేసుకోవడం జరిగిందన్ని ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాల్సింది పోయి బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్స్ ఆర్టిజన్స్ కి ఇవ్వడం జరిగిందన్ని ఆ ఆర్డర్ ప్రకారం అయినా ఐదు సంవత్సరాలు తర్వాత గ్రేడ్ చేంజ్ ప్రమోషన్స్ ఇవ్వాలన్ని నేటికీ ఎనిమిది సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ఎలాంటి గ్రేడ్ చేంజ్ లేదు ఎలాంటి ప్రమోషన్స్ లెవన్నీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఆనాడు పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో మా ప్రభుత్వం రాగానే ఆర్టిజన్స్ అందరిని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారాన్ని ఈ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తుంది. అయినా ప్రభుత్వం గానీ, యాజమాన్యంలో గాని ఎలాంటి స్పందన లేదు అన్ని ఈ విద్యుత్ సంస్థలో ఉన్న తొమ్మిది సంఘాలను ఏకమై జేఏసీగా ఏర్పడడం శుభపరిణామం అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ కింద డిమాండ్స్ను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
డిమాండ్స్
1. విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలి
2. APSEB సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
3. ఆర్టిజన్ కాకుండా మిగిలిపోయిన నాన్ ఆర్టిజన్ కార్మికులను ఆర్టిజన్ గా గుర్తించాలి
4. ఆన్ మాన్ కార్మికులను ఈ సంస్థలో విలీనం చేసుకోవాలి
5. పీస్ రేట్ కార్మికుల్ని మరియు మీటర్ రీడర్స్ ని జీవో నంబర్ 11 ప్రకారం వేతనాలు ఇవ్వాలి
6. 2026 పి ఆర్ సి కమిటీ వెంటనే వేయాలి.జరిగే సమ్మెకు సిఐటియు మెదక్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. కావున జిల్లాలోని కార్మికులందరూ పెద్ద ఎత్తున సమ్మె లో పాల్గొని ప్రభుత్వం యాజమాన్యం, మెడలు వంచి హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ (సిఐటియు) యూనియన్ జిల్లా కార్యదర్శి గుడాల రవీంద్ర ప్రసాద్ ఉపాధ్యక్షులు రాజు నాయక్, సురేష్ , భాను ప్రసాద్ పృధ్విరాజ్ జిన్నా నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు
