మరణించిన కుటుంబాలను పరామర్శించిన నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి
Published on 08 Apr 2026, 10:53 PM 23
JH-30738
జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రభులింగం మాతృమూర్తి అనారోగ్యంతో మరణించగా, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం కొల్చారం మండల కేంద్రంలో అనారోగ్యంతో మరణించిన ప్రవీణ్ మృతదేహానికి కూడా ఆవుల రాజిరెడ్డి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
