రామాయంపేట మండల న్యాయ సేవ ప్రజా చైతన్య సమితి సభ్యుడు గా బండారి కిషన్ నియామకం
Published on 08 Apr 2026, 10:49 PM 161
JH-71321
జనహితం న్యూస్, మెదక్ రూరల్: సమాచార హక్కు చట్టం-2005 (ఆర్ టి ఐ) పై ప్రజల్లో అవగాహన కల్పించి, సామాజిక పారదర్శకత కోసం కృషి చేస్తున్న న్యాయ సేవ ప్రజా చైతన్య సమితి తన కార్యకలాపాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో సంస్థను బలోపేతం చేసేందుకు నూతన నియామకాన్ని చేపట్టింది.
నియామక వివరాలు:
సంస్థ వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు చాపల కిరణ్ కుమార్ ఆమోదంతో, నిజామాబాద్ జిల్లా సభ్యులు పి. నాగేష్ పర్యవేక్షణలో ఈ నియామకం జరిగింది. మెదక్ జిల్లా, రామాయంపేట మండల సభ్యుడి గా బండారి కిషన్ ని నియమిస్తూ సమితి ఉత్తర్వులు జారీ చేసింది.
బాధ్యతలు:
ఈ సందర్భంగా సమితి నాయకత్వం మాట్లాడుతూ.., బండారి కిషన్ తన అంకితభావం, నిబద్ధతతో సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా: సమాచార హక్కు చట్టం-2005 పై ప్రతి పౌరుడికి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. సమితి యొక్క ఆశయాలను, భావజాలాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. నిబద్ధతతో పనిచేస్తూ సామాజిక చైతన్యానికి తోడ్పడాలని కోరారు. రామాయంపేట మండల సభ్యుడిగా నియమితులైన బండారి కిషన్ న్యాయ సేవ ప్రజా చైతన్య సమితి ఘనంగా స్వాగతం పలుకుతోంది.
