సర్దన గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
Published on 07 Apr 2026, 07:51 PM 79
JH-23036
జనహితం న్యూస్, మెదక్ రూరల్: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు" ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక" లో భాగంగా మెడికల్ డిపార్ట్మెంట్ నిర్వహించుచున్న హెల్త్ వీక్ (తేదీ 6.4.2026 నుండి 11.4.2026 వరకు) లో భాగంగా ఈ రోజు అనగా తేదీ 07.04.2026 రోజున ఉదయం జిల్లాలోని అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ (PHC) లలో ఆరోగ్య శిబిరాలు (Health Camps) నిర్వహించబడును. కావున ఇట్టి విషయము ప్రజలకు తెలియజేయగలరు మరియు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, వార్డు సభ్యులు, మండల ,గ్రామస్థాయి అధికారులు ఈ యొక్క హెల్త్ క్యాంపులో పాల్గొని విజయవంతం చేయగలరు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మరియు సర్దన పి హెచ్ సి డాక్టర్ వినయ్ సార్, ఎమ్మార్వో రేణుక గారు, MPO కృష్ణవేణి, గ్రామ సర్పంచ్ వినోద సతీష్, కార్యదర్శి ప్రమోద్ వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు అందరూ అన్ని టెస్టులు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేయించుకున్నారు
