హనుమాన్ జయంతి ఉత్సవాలకు ముస్తాబవుతున్న తూప్రాన్ చెరువు కట్ట వీరాంజనేయ స్వామి ఆలయం
Published on 28 Mar 2026, 06:09 PM 73
JH-21617
జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని చెరువుకట్టపై ప్రకృతి మమేకమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, ఆలయ పురోహితులు శ్రీ శలాక ఆత్రేయ శర్మ అధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలకు ముస్తాబు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నాడు హనుమాన్ మాలధారణ గురు స్వామి ఆలయ పురోహితులు ఆత్రేయ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం హనుమాన్ మాలధారణ స్వాములు హనుమాన్ చాలీసా పారాయణము దండకము, నిత్యం దైవ నామస్మరణతో జపాలు , రామకోటి కార్యక్రమాలు అలాగే శ్రీ సీతారాములు హనుమాన్ దేవుళ్ల భజన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
అనంతరం తూప్రాన్ వాస్తవ్యులు బాయికాడి వెంకటేష్ ఆధ్వర్యంలో హనుమాన్ మాలధారణ స్వాములకు మహా అన్నదాన ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ మాలధారణ గురు స్వామి ఆత్రేయ శర్మ, మచ్చ యాదగిరి, నాగరాజ్, కౌన్సిలర్ జైపాల్ రాథోడ్, దుర్గం నాగేష్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మహా గొప్పదని, అన్నదానం పుణ్యకార్యమని తెలిపారు. అన్నదానం నీళ్ల దానం చేయడం, ఆ భగవంతుడు ఇచ్చిన వరం అని భావిస్తున్నామని తూప్రాన్ చెరువు కట్ట వీరాంజనేయ స్వామి ఆలయం ఎన్నో ఏళ్లుగా దేదీప్యమానంగా వెలుగొందుతూ నిత్య పూజలు అందుకుంటూ ఉందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు శ్రీ శలాక ఆత్రేయ శర్మ హనుమాన్ మాలధారణ స్వాములు పాల్గొన్నారు.
