ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను ఖండించిన సిఐటియు మెదక్ జిల్లా కమిటీ
Published on 28 Mar 2026, 06:20 PM 41
JH-86712
జనహితం న్యూస్, మెదక్ రూరల్: ఆశా వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో ఆశల సమస్య ల పై చర్చించాలని, వేతనం 18 వేలు నిర్ణయించి అమలు చేయాలని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు దగ్గర ధర్నాకు బయలు దేరిన ఆశ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయడాన్ని సిఐటీయు మెదక్ జిల్లా కమిటీ ఖండించింది.
ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం, జిల్లా కోశాధికారి కే నర్సమ్మ మాట్లాడుతూ... ఆశ వర్కర్లు తమ సమస్యల పై ఇందిరా పార్కు దగ్గర ధర్నా నిర్వహించి సమస్యల తో కూడిన వినతి పత్రాన్నీ ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ధర్నాకు వెళుతున్న వారిని వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల ముందు నుంచి రాష్ట్రం లో అరెస్టులు చేయడాన్ని సిఐటీయు మండిపడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్న ఈ రాష్ట్రం లో కార్మికుల హక్కులు అడిగే అవకాశం లేదా అని ప్రశ్నించింది. ఎన్నికల ముందు ఆశలు పోరాటాలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఆశలకు వేతనాలు పెంచుతామని,18 వేలు ఫిక్స్డ్ చేస్తామని మ్యానిఫెస్టోలో రాసుకొని ఇప్పుడు మాట తప్పుతుందన్నారు. సమస్యలు పరిష్కరించకుండా అరెస్టులు చేస్తే పోరాటాన్ని ఆపితే సిఐటీయు చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల సమస్యలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో చర్చించాలని, ఫిక్స్డ్ వేతనం 18 వేలు నిర్ణయించి అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
