హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
మెదక్‌లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా – పద్మదేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు JH-55513

జనహితం న్యూస్, మెదక్ రూరల్ మార్చి 27: మెదక్ పట్టణంలోని ద్వారకా నగర్‌లో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రభు రెడ్డి పద్మ దేవేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సంధ్య, నవీన్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సులోచన ప్రభు రెడ్డి, ఆరేళ్ల గాయత్రి ఆర్కే శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
మెదక్‌లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా – పద్మదేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు
మెదక్‌లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా – పద్మదేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌