హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు JH-35484

జనహితం న్యూస్, మెదక్ రూరల్ ఏప్రిల్ 05: మెదక్ జిల్లా కేంద్రంలో ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా సీనియర్ నాయకులు ఊసన్నగల్ల మురళి మాదిగ మాట్లాడుతు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. హక్కుల కోసం బిక్షమెతకండి పోరాడి సాధించమన్నారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆయన స్ఫూర్తితో ఈరోజు చాలామంది నాయకులుగా గుర్తింపు పొందారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అన్ని కుల ప్రజాసంఘాల నాయకులు పాల్గొని సమాజంలో జరుగుతున్న వివక్షపై వివరించడానికి ఇది సరైన వేదికని జిల్లా స్థాయి అధికారులు మరియు రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం ఆనాడు బాబు జగ్జీవన్ రామ్ అనేక సందర్భాల్లో అన్ని వర్గాల పేద ప్రజలకు అండగా నిలబడ్డ నాయకుడిగా గుర్తింపు పొందాడు. అదేవిధంగా నేడు ఎమ్మార్పీఎస్ ఉద్యమం ద్వారా అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడి న్యాయపోరాటం చేస్తున్న ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడ ప్రశ్నించే గొంతుక ఎవరైనా ఉన్నారంటే ఆయనే మాన్యశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్న సైన్యంగా ఈరోజు ఈ గౌరవం దక్కిందని వారు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మహనీయుల కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గరుగుల శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ, ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా కార్యనిర్వాహ అధ్యక్షులు అస్త్రగళ్ల బాలరాజ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్ము షేకులు మాదిగ మరియు దళిత సంఘాల నాయకులు రాజకీయ నాయకులు, అధికారులు అనధికారులు తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌