హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
సర్దన గ్రామంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు – సర్పంచ్ వినోద సతీష్ JH-52330

జనహితం న్యూస్, మెదక్ రూరల్ ఏప్రిల్ 05: మెదక్ జిల్లా హావేళ్ళి ఘణపూర్ మండలం సర్ధన గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎనమిది వినోద సతీష్, మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త భారతదేశానికి విశేష సేవలను అందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఆమె అన్నారు.

మాట్లాడుతూ గొప్ప సంఘసంస్కర్త గా తన పరిపాలనదక్షతో అఖండ భారత విశేష సేవలు అందించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీ తరపున కార్మిక శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన గణత ఈ గొప్ప నాయకునికి దక్కింది అని అన్నారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కొత్త చట్టాలను కార్మికులకుప్రవేశపెడుతూ వారి అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చరిత్రలో నిలిచారన్నారు.

ఇటువంటి గొప్ప మహనీయుల ఆయన జయంతి రోజున తలుచుకోవడం అదృష్టంగా భావించాలి అలాగే నేటితరం యువత ఆయన బాటలో నడుస్తూ ఆయన సూచన ఆయన చేసినటువంటి పనులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అలాంటి గొప్ప యోధుడికి గొప్ప సంఘసంస్కర్తకి ఇవే మా మనసుమంజూలు ఇట్టి జయంతి కార్యక్రమం లో పాల్గొన్న ఎనమిది సతీష్, కందారం రాజు, వార్డు మెంబర్ డప్పు రాజు, పోల్కంపేట మోష, డప్పు ఎసయ్య,కిష్టయ్య, లచ్చయ్యలు, తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
సర్దన గ్రామంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు – సర్పంచ్ వినోద సతీష్
సర్దన గ్రామంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు – సర్పంచ్ వినోద సతీష్

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌