రాత్రి 11 లోపు దుకాణాలు మూసివేయాలి నిబంధనలు అతిక్రమిస్తే కేసులు
Published on 05 Apr 2026, 08:20 PM 34
JH-84563
జనహితం న్యూస్ మెదక్ రూరల్ ఏప్రిల్ 05: మెదక్ డివిజన్ పరిధిలో ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా రాత్రి 11 గంటల లోపు అన్ని దుకాణాలు వ్యాపార సంస్థలు మరియు ఇతర ఎస్టాబేస్మెంట్లు తప్పనిసరిగా మూసివేయాలని మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ స్పష్టం చేశారు. భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాత్రి 11 గంటల అనంతరం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారని ఆ సమయంలో దుకాణాలు తెరిచి ఉన్న లేదా సంస్థలు గుర్తిస్తే సంబంధిత యాజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయబడతాయని పేర్కొన్నారు. ప్రజలు వ్యాపారులు పోలీసు శాఖతో సహకరించి ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని అందరూ కలిసి మెదక్ పట్టణంలో శాంతి భద్రత లను కాపాడాలని మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ విజ్ఞప్తి చేశారు.
