గజ్వేల్ కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం – మల్లికార్జున్ గౌడ్
Published on 04 Apr 2026, 08:42 PM 81
JH-72321
జనహితం న్యూస్, మెదక్ రూరల్: గజ్వేల్ కేసీఆర్ గారి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అల్లరి మూకలు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి ఆఫీసు మీద దాడి చేసి ఫర్నిచర్ ని ధ్వంసం చేయడానికి ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు & నియోజకవర్గ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ మల్లికార్జున్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ... గాంధీ వాదం అని చెప్పుకుంటూ నే కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తుంది అని ప్రసంగాలలో సమావేశాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రేవంత్ రెడ్డి మాటలు విని కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీలుగా రెచ్చిపోతున్నారని మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎత్తయిన గాంధీ విగ్రహాలు నిర్మించాలని, సమావేశాల్లో చెప్పాలి చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేతల్లో ఎందుకు గాంధీయవాదాన్ని అనుసరించడం లేదు అని ప్రశ్నించారు. ఇదేనా మీ ఇందిరమ్మ పాలన..!?? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా వినాశనం విధ్వంసం, దాడులు, కొట్లాటలు, లాక్కోవడం, ఇల్లు కూలగొట్టడం ఇటువంటి అరాచకాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ప్రభుత్వాన్ని నడపడం లేదు అని రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శునకానందాన్ని పొందుతున్నారని దుయ్యబట్టారు. ఇంత జరుగుతున్న రాష్ట్రానికి 10 సంవత్సరాలు పరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారి కార్యాలయానికి రక్షణ అందించే స్థితిలో తెలంగాణ పోలీసులు లేరా అని ప్రశ్నించారు.
