హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
పంచాయతీ నిధులు దుర్వినియోగం – సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి JH-29963

జనహితం న్యూస్, మెదక్ జిల్లా రూరల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం తంప్లూర్ గ్రామపంచాయతీ 15 ఫైనాన్స్ నిధులను కార్యదర్శి దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు కలెక్టర్, డిపిఓ అధికారులకు గ్రామస్తులు పిర్యాదు చేశారు. 02-04-2026 నాడు గ్రామ ప్రజల సమక్షంలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు.. గ్రామ సభలో గ్రామస్థులు గ్రామ పంచాయతీ నిధుల లెక్కలను గ్రామ కార్యదర్శి ని అడిగారు. ఈ విషయంపై అధికారి సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని వారు పేర్కొన్నారు. జనవరి నుంచి మార్చ్ వరకు సూమారు Rs.9,25,000/- ( అక్షరాల 9లక్షల 25వేల రూపాయలను )సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు సెక్రటరీ దుర్వినియోగం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ నిధులకు సరియైన రికార్డు లు చూపించమని సెక్రటరీని కోరగా నేను మీకు చూపించే అవసరము లేదని ఆడిట్ వాళ్లకు చూపిస్తనని అన్నాడని వారు తెలిపారు.

అంతే కాకుండా నా పై అధికారులకు ఫిర్యాదు చేసుకోగలరని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని తెలిపారు. కావున నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు సెక్రటరీ పై శాఖపరమైన,చట్ట పరమైన చర్యలు తీసుకోని గ్రామ ప్రజలకు న్యాయము చేయగలరని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Click to join Whatsapp channel
Janahitham News
పంచాయతీ నిధులు దుర్వినియోగం – సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి
పంచాయతీ నిధులు దుర్వినియోగం – సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌