హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
సర్దనలో అంబేద్కర్ జయంతి ఘనంగా… ‘జై భీమ్’ నినాదాలతో కార్యక్రమం JH-24722

జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలం సర్దన గ్రామంలో ఈ రోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి పురస్కరించుకొని బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు జై భీమ్ అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్టీవో శ్రీలేఖ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్లనే మనం చాలా గౌరవంగా మహిళలు గొప్పగా జీవిస్తున్నాం అలాంటి మహానుభావుడు ఈరోజు పుట్టిన సందర్భంగా సేవలను తలుచుకుంటూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌ ఎన్నో ఇబ్బందులు పడుతూ అంటరానితనాన్ని తన జీవితంలో చిన్న నాటి నుండి అతని బడిలో నుంచి వెలివేసిన పట్టుదలతో ఎన్నో డిగ్రీలు సాధించి రాజ్యాంగాన్ని రాసి మహిళా మహిళలకు బిల్లు ప్రవేశపెట్టి భారత రాజ్యాంగాన్ని రాసిన ఇలాంటి ప్రపంచ ఒక మేధావి మళ్లీ మన దేశాన పుట్టాలని తలుచుకుంటూ ఆమె స్మరించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు గ్రామ సర్పంచ్ వినోద సతీష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
సర్దనలో అంబేద్కర్ జయంతి ఘనంగా… ‘జై భీమ్’ నినాదాలతో కార్యక్రమం
సర్దనలో అంబేద్కర్ జయంతి ఘనంగా… ‘జై భీమ్’ నినాదాలతో కార్యక్రమం

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌