నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
Published on 03 Apr 2026, 11:15 PM 14
JH-91374
జనహితం న్యూస్ మెదక్ రూరల్: మెదక్ గీత స్కూల్ సంస్థల అధినేత రామాంజనేయులు కుమార్తె నిషిత వివాహం మోహిత్ తో శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని గీతా స్కూల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకల్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు, హరీష్ రావు గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
వీరి వెంట మాజీ ఇఫ్కో డైరెక్టర్ యం. దేవేందర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఏం లావణ్య రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్లు లలిత, స్వరూప, సంధ్య, శృతి, రాణి, గౌస్, న్యాయవాది జీవన్ రావు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.
