హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
సలేశ్వరం జాతరలో విషాదం.. హోం గార్డ్ ఆత్మహత్య JH-70728

జనహితం న్యూస్ : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం సలేశ్వరం జాతరలో విషాద ఘటన చోటుచేసుకుంది. బందోబస్తు విధుల్లో ఉన్న ఓ హోం గార్డ్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.

కొల్లాపూర్ మండలం చెంచుగూడెంకు చెందిన బయన్న (46) కోడేరు పోలీస్ స్టేషన్‌లో హోం గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జాతర బందోబస్తులో భాగంగా విధుల్లో ఉన్న సమయంలో ఆయన విషం సేవించినట్లు సమాచారం.

తీవ్ర అస్వస్థతకు గురైన బయన్నను వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కుటుంబ పరిస్థితులు కూడా ఈ ఘటనకు కారణంగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడు సంవత్సరాల క్రితం ఆయన భార్య కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

మృతదేహాన్ని నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Click to join Whatsapp channel
Janahitham News
సలేశ్వరం జాతరలో విషాదం.. హోం గార్డ్ ఆత్మహత్య
సలేశ్వరం జాతరలో విషాదం.. హోం గార్డ్ ఆత్మహత్య

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్