హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. విద్యార్థుల్లో పరుగులు JH-11087

జనహితం న్యూస్ : తెలంగాణలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తమ తమ పరీక్షలపై దృష్టి సారించారు. ఇంజినీరింగ్ నుంచి పాలిటెక్నిక్ వరకు, లా నుంచి గురుకుల ప్రవేశాల వరకు పలు ముఖ్యమైన పరీక్షల తేదీలను అధికారులు ప్రకటించారు.

ఇంజినీరింగ్‌లో ప్రవేశం కోసం నిర్వహించే TG EAPCET (MPC) పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో జరుగుతాయి. అదే సమయంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన TG EAPCET (BiPC) పరీక్షలు మే 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ రెండు విభాగాలకు దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 4గా నిర్ణయించారు.

ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాలనుకునే వారికి TG EdCET మే 12న నిర్వహించనుండగా, MBA, MCA కోర్సులకు TG ICET పరీక్షలు మే 13, 14 తేదీల్లో జరుగుతాయి. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థుల కోసం TG ECET పరీక్ష మే 15న ఉంటుంది.

లా కోర్సులకు ఆసక్తి ఉన్నవారికి TG LAWCET (3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు) పరీక్ష మే 18న నిర్వహించనున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు TG PECET పరీక్షలు మే 31 నుంచి జూన్ 3 వరకు జరుగుతాయి.

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కోసం TG POLYCET పరీక్ష మే 13న నిర్వహించనున్నారు. ఇక పీజీ కోర్సులకు సంబంధించిన TG PGECET పరీక్షలు మే 28 నుంచి 31 వరకు జరుగుతాయి.

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోసం TG DEECET దరఖాస్తులు మార్చి 15 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 15 వరకు కొనసాగనున్నాయి.

గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన TGTWREIS COE (ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం) దరఖాస్తులు మార్చి 12 నుంచి ఏప్రిల్ 7 వరకు స్వీకరిస్తున్నారు.

ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా TGPSC వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)ను మార్చి 25లోపు పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన TGRJC-CET 2026 పరీక్ష మే 3న నిర్వహించనున్నారు. దీనికి దరఖాస్తులు మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు అందుబాటులో ఉంటాయి.

ఇక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV)లో ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం కూడా మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్

1) TG EAPCET (Engineering)

  • అర్హత: ఇంటర్ (MPC)
  • దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 4
  • పరీక్ష తేదీలు: మే 9, 10, 11
  • Apply at Student ONLINE

2) TG EAPCET (Agri/Pharma)

  • అర్హత: ఇంటర్ (BiPC)
  • దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 4
  • పరీక్ష తేదీలు: మే 4, 5
  • Apply at Student ONLINE

3) TG EdCET

  • అర్హత: ఏదైనా డిగ్రీ/పిజి
  • దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 15
  • పరీక్ష తేదీ: మే 12
  • Apply at Student ONLINE

4) TG ICET

  • అర్హత: ఏదైనా డిగ్రీ
  • దరఖాస్తు చివరి తేదీ: మార్చి 16
  • పరీక్ష తేదీలు: మే 13, 14
  • Apply at Student ONLINE

5) TG ECET

  • అర్హత: డిప్లొమా/B.Sc (మ్యాథ్స్)
  • దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 18
  • పరీక్ష తేదీ: మే 15
  • Apply at Student ONLINE

6) TG LAWCET (3 Years)

  • అర్హత: ఏదైనా డిగ్రీ
  • దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 1
  • పరీక్ష తేదీ: మే 18
  • Apply at Student ONLINE

7) TG LAWCET (5 Years)

  • అర్హత: ఇంటర్
  • దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 1
  • పరీక్ష తేదీ: మే 18
  • Apply at Student ONLINE 

8) TG PECET (Degree/Inter)

  • అర్హత: డిగ్రీ/ఇంటర్
  • దరఖాస్తు చివరి తేదీ: మే 5
  • పరీక్ష తేదీలు: మే 31 - జూన్ 3
  • Apply at Student ONLINE

9) TG POLYCET

  • అర్హత: 10వ తరగతి
  • దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 20
  • పరీక్ష తేదీ: మే 13
  • Apply at Student ONLINE

10) TG PGECET

  • అర్హత: B.E/B.Tech/ B.Pharm
  • దరఖాస్తు చివరి తేదీ: మే 6
  • పరీక్ష తేదీలు: మే 28 - 31
  • Apply at Student ONLINE

11) TG DEECET - 2026

  • అర్హత: ఇంటర్మీడియట్
  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: మార్చి 15
  • దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 15
  • Apply at Student ONLINE

12) TGTWREIS COE ప్రవేశాలు (Intermediate 1st Year)

  • కోర్సులు: MPC & BPC
  • దరఖాస్తు తేదీలు: 12-03-2026 నుండి 07-04-2026 వరకు
  • Apply at Student ONLINE 

13) TGPSC OTR - వన్ టైమ్ రిజిస్ట్రేషన్

  • చివరి తేదీ: మార్చి 25
  • వివరాలు: TGPSC ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి OTR తప్పనిసరి.
  • Apply at Student ONLINE

14) TGRJC-CET 2026 (గురుకుల జూనియర్ కళాశాలలు)

  • కోర్సులు: ఇంటర్మీడియట్ (MPC, BPC, MEC)
  • అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
  • దరఖాస్తు తేదీలు: 16-03-2026 నుండి 15-04-2026 వరకు
  • పరీక్ష తేదీ: 03-05-2026
  • Apply at Student ONLINE

15) KGBV - కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ప్రవేశాలు

  • కోర్సులు: ఇంటర్మీడియట్ (MPC, BPC, CEC)
  • అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
  • దరఖాస్తు తేదీలు: 16-03-2026 నుండి 15-04-2026 వరకు
  • పరీక్ష తేదీ: 03-05-2026
Click to join Whatsapp channel
Janahitham News
తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. విద్యార్థుల్లో పరుగులు
తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. విద్యార్థుల్లో పరుగులు

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్