సమ్మక్క సారలమ్మ గద్దలను దర్శించుకున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Published on 23 Mar 2026, 07:07 PM 53
JH-50432
జనహితం న్యూస్: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి శ్రీ సమ్మక్క - సారలమ్మ లను దర్శించుకున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
అనంతరం గద్దెల ప్రాంగణంలో అన్నగారు మాట్లాడుతూ....
కాకతీయులు, ఆదివాసీల పైన చేసిన దౌర్జన్యాలను, అణిచివేతలకు, ఆదివాసీలు అడవిలో బ్రతుకుతున్నటువంటి జీవన విధానాలను వారి యొక్క స్వేచ్ఛను హరిస్తూ, శిస్తు, పన్నుల ద్వారా బెదిరించి దౌర్జన్యాలకు పాల్పడిన కాకతీయుల పై దండెత్తి, మేడారం కేంద్రంగా,నగారా మోగించి భీకర యుద్ధ భూమిలో, అలుపెరుగని పోరాటం చేసి, జాతి కోసం, ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం, తృణప్రాయంగా కుటుంబమే సజీవ నరమేధంలో భాగస్వాములై, వనజాతి ప్రజల కోసం, వారి యొక్క సామంత రాజ్యం కోసం అరణ్యంలో వనదేవతలుగా ఎన్నో ఏండ్ల కానుండి కీర్తింపబడుతూ, దేశంలోనే కాక ఆసియా ఖండంలోనే అతి గొప్పగా కోట్లాదిమంది భక్తులను ఆశీర్వదిస్తున్నారు ఈ తల్లులు.
ఈరోజు శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల దగ్గరికి వచ్చి దర్శించుకోవడం ఒక గొప్ప తరుణంగా భావిస్తున్నారని అన్న గారు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో, MSP జాతీయ నాయకులు మంద కుమార్ మాదిగ పుట్ట రవి మాదిగ గుగ్గిళ్ళ పీరయ్య వేల్పుల సూరన్న మాదిగ, మాదిగ MSP ములుగు జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యాంబాబు మాదిగ, MSP జిల్లా అధికార ప్రతినిధి గజ్జల ప్రసాద్ మాదిగ, MRPS పుల్లూరి కరుణాకర్ మాదిగ, MSF ములుగు జిల్లా అధ్యక్షులు పేరాల బలరాం మాదిగ, MRPS MSP రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
