TG Inter Results 2026 LIVE: 1st & 2nd Year ఫలితాలు విడుదల
Published on 12 Apr 2026, 11:00 AM 139
JH-69050
హైదరాబాద్, ఏప్రిల్ 12 (జనహితం న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE) 2026 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలను ఈ రోజు విడుదల చేసింది.
ఈ ఫలితాలు ఉదయం 11:00 గంటల నుంచి ఆన్లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం నుంచే ఆసక్తిగా ఎదురుచూశారు. ఫలితాలు ప్రకటించగానే అధికారిక వెబ్‌సైట్‌లపై భారీగా ట్రాఫిక్ పెరిగింది.
విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవడానికి క్రింది లింక్‌ను ఉపయోగించుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే వెంటనే ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
👉 https://tgbie.in/result.html
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. కొంతమంది విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు తమ ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫలితాల్లో మార్కులు, గ్రేడ్‌లు, పాస్ లేదా ఫెయిల్ వివరాలు స్పష్టంగా చూపబడుతున్నాయి. వెబ్‌సైట్ స్లోగా పనిచేసే అవకాశమున్నందున, విద్యార్థులు ఓపికగా ప్రయత్నించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇక, ఒరిజినల్ మార్క్స్ మెమోలు త్వరలో కాలేజీల ద్వారా అందజేయనున్నట్లు సమాచారం.
ఫలితాలు ఎలా చూసుకోవాలి?
- పై లింక్ ఓపెన్ చేయాలి
- హాల్ టికెట్ నంబర్ నమోదు చేయాలి
- “Show” పై క్లిక్ చేయాలి
- ఫలితం వెంటనే కనిపిస్తుంది
