రాత్రి అయినా హాజరు కావాల్సిందే – ఆర్థిక కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం
Published on 23 Mar 2026, 07:41 PM 41
JH-14201
జనహితం న్యూస్: ఈరోజు అర్ధరాత్రి వరకైనా కోర్టులోనే ఉంటాము ఆర్థిక కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాల్సిందే ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.
తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లుగా తమ పెండింగ్ బకాయిలు, బెనిఫిట్స్ చెల్లించడంలేదని హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ ఉద్యోగులు, వారికి వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఏడాది నుండి బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆర్థిక కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాధితులు.
గతంలో ఈ పిటిషన్ విచారిస్తూ ఈరోజు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినప్పటికీ, ఆర్థిక కార్యదర్శి కోర్టుకు రాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి అసెంబ్లీ సమావేశాల వల్ల రాలేకపోయారని సమాధానమిచ్చిన ప్రభుత్వం తరపు న్యాయవాది.
అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని ముందే తెలుసు కదా, రాలేనని ముందే చెప్తే మినహాయింపు ఇచ్చేవాళ్ళం కానీ ఈరోజు ఎంత రాత్రయినా ఆర్థిక కార్యదర్శి కోర్టులో హాజరు కావాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు న్యాయమూర్తి
