బాబు జగ్జీవన్ రావు జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన పోచారం శ్రీనివాసరెడ్డి
Published on 05 Apr 2026, 02:55 PM 70
JH-57576
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ మున్సిపల్ పరిధిలో ఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.
మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావ్ సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు, భారతదేశానికి విశిష్ట సేవలు అందించిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిద్దాం అణగారిన వర్గాల అభివృద్ధి కోసం చేసిన ఆయన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయి. ఆయన ఆశయాలను మనం కొనసాగిద్దాం అని వారు వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
