హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
బాబూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – సర్పంచ్ అనీల్ కుమార్ పిలుపు JH-61804

జనహితం న్యూస్, కామారెడ్డి: బీర్కూర్ గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు, సామజికవేత్త, భారత దేశ మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని బరంగ్ ఏడ్గి గ్రామ సర్పంచ్ రెంజర్ల అనీల్ కుమార్ అన్నారు. ఈ సందర్బంగా గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద డా. బాబూ జగ్జీవన్ రాం 119 వ జయంతి ఉత్సవాలను మాదిగ దండోరా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

అనంతరం అయన మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రాం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని, భారత దేశ స్వతంత్రం కోసం పోరాటం చేశారన్నారు. అదేవిదంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కార్మికుల అభ్యున్నతి కోసం, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవం కోసం, రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దేశ రక్షణ కోసం బాగా కృషి చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా అణగారిన వర్గాల అస్పృష్యత నిర్ములన కోసం పోరాటం చేశారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ప్రవీణ్ దేశ్ ముఖ్, ఏఎంసీ డైరెక్టర్ గొండ్ల రాజు, పంచాయతీ కార్యదర్శి గురునాద్, వార్డు సభ్యులు ఫుల్కంటి గంగవ్వ, బట్టికాడి భూమవ్వ, రాచకొండ బాలయ్య, గైని సాయిలు, లక్కపల్లి హన్మాండ్లు, నాయకులు కాదేపురం గంగన్న, బోయి లాలయ్య, కుమ్మరి గంగారాం, బుజ్జిగొండ, నీరడి రాములు, వడ్ల నాగయ్య, సిద్ధంశెట్టి శివరాజ్, గైని చిన్న రాములు, నల్లి లక్ష్మన్, బొజ్జ రామయ్య, మేత్రి చంద్రయ్య, రాచకొండ గంగారాం, బోయి చిన్న సాయిలు, బొజ్జ శంకర్, బోయి జైపాల్, బోయి సుధాకర్, టేకుర్ల సతీష్, క్యాదెని లక్షప్ప, మేత్రి పీరుగొండ, కోటగిరి గంగొండ, సందుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
బాబూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – సర్పంచ్ అనీల్ కుమార్ పిలుపు
బాబూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – సర్పంచ్ అనీల్ కుమార్ పిలుపు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్