హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
కామారెడ్డిలో వరి కొనుగోలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు JH-96306

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా పరిపాలన కీలక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం సివిల్ సప్లయ్ కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ 08468-220051 అనే కంట్రోల్ రూమ్ నంబర్ను ప్రజలకు అందుబాటులో ఉంచుతూ, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రైతులు తమకు ఎదురయ్యే సమస్యలు, సందేహాలు, కొనుగోలు సంబంధిత వివరాల కోసం ఈ నంబర్ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

వరి కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం, సమర్థతను పెంచేందుకు ఈ కంట్రోల్ రూమ్ అధికారులు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై మేనేజర్ శ్రీకాంత్, జిల్లా సహకారాధికారి, రామ్మోహన్, కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
కామారెడ్డిలో వరి కొనుగోలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కామారెడ్డిలో వరి కొనుగోలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్