హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
డా.బాబు జగ్జీవన్ రామ్ ఆయన సేవల్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నాం - 119వ జయంతి JH-87631

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ గ్రౌండ్లో డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాదిగ ఈ సందర్భంగా మాట్లాడుతూ.., భారతదేశానికి చేసిన సేవలు అనితరసాధారణం, ఆయన ఒక సామాజిక న్యాయ యోధుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ ముఖ్యమైన సేవలు సామాజిక న్యాయం అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు.

రాజకీయ జీవితం:

  • 1936 నుండి 1986 వరకు పార్లిమెంటు సభ్యుడిగా పనిచేశారు.
  • మినిస్టర్: కార్మిక, రక్షణ, వ్యవసాయ మంత్రిగా పనిచేశారు.
  • ఉప ప్రధాని: 1977-79లో భారతదేశ ఉప ప్రధానిగా పనిచేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా రూ 5 లక్షలు ఇస్తున్నారు కానీ ఎస్సీలకు ప్రత్యేక గుర్తించి 8 లక్షలు వరకు ఇవ్వాలి లేదా ఇసుక సిమెంటు స్టీల్ ఫ్రీగా ఇవ్వాలి. 

గవర్నమెంట్ దృష్టికి అడిషనల్ కలెక్టర్ చెప్పడం జరిగింది. గ్రామసభలో తీర్మానం చేయాలి మరియు అసైన్మెంట్ భూములు పట్టాలు గా మార్చి ఇవ్వాలి కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధు మోహన్ సార్ ఆర్డీవో ఈడి వెంకటేశ్ గ్రంథాలయచైర్మన్ మున్సిపాలిటీ చైర్మన్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గంగారం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కాసిరం, భాగయ్య బలరాం, వెంకట్ రవీందర్ రాజు, వివిధ సంఘ నాయకులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
డా.బాబు జగ్జీవన్ రామ్ ఆయన సేవల్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నాం - 119వ జయంతి
డా.బాబు జగ్జీవన్ రామ్ ఆయన సేవల్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నాం - 119వ జయంతి

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్