హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
బాన్సువాడలో రియల్ ఎస్టేట్ దందా బహిరంగం.. అనుమతి లేకుండానే ప్లాట్ల అమ్మకాలు! JH-15593

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మునిసిపాలిటీ పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి 50 పై ఎకరాలతో వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అనుమతులు ఆ దేవుడు ఎరుగు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వం నుండి పూర్తిస్థాయి అనుమతులు పొందిన తర్వాతనే వెంచర్లను ఏర్పాటు చేసి విక్రయించాలి, కానీ ఇక్కడ మాత్రం అలా జరగడంలేదని కొంతమంది మేధావి వర్గం బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

అమాయక ప్రజలను మోసం చేస్తూ ఫైనల్ ఎల్పీ రాకముందే ప్లాట్లను ప్రజలకు అధిక ధరలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కోట్లకు పరిగెత్తుతున్నారు. కల్కి చెరువు కింద ఉన్నటువంటి భూములను సైతం వెంచర్ల గా తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం వెంచర్లు ఏర్పాటు చేయాలంటే ఆ భూమి పంటలకు ఏమాత్రం అనుకూలించకుండా ఉంటేనే వెంచర్లను ఏర్పాటు చేయాలి. అది కూడా పూర్తిస్థాయి అనుమతులు పొందిన తర్వాతనే వెంచర్లను ఏర్పాటు చేయాలి, కానీ ఇక్కడున్న కొందరు జిల్లా మున్సిపాలిటీ అధికారుల ప్రోత్బలంతోనే ఇష్టానుసారంగా అధికారులను సైతం మంచిగా చేసుకొని ఇలాంటి వ్యవహారాలకు పూనుకుంటున్నారు.

ఈ ప్రవేట్ వెంచర్ల రియల్ ఎస్టేట్ వ్యాపారుల కు వత్తాసు పలుకుతున్న అధికారులు ఇదిలా ఉండగా వెంచర్లలో ఏర్పాటు చేస్తే రోడ్లకు గాను డ్రైనేజీలకు గాను ఎంచక్కా కల్కి చెరువు నీటిని సైతం ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు కల్కి చెరువు కట్టకింద కాలువల ద్వారా సుమారు 2000 ఎకరాల ఆయకట్టు రైతులు పంటను పండిస్తారు వేసవి కాలం కావడంతో కల్కి చెరువు కాలువల ద్వారా పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీరు అందక రైతులు సతమతమవుతున్నారు.

వెంచర్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ నీటిని శౌర్యం చేస్తూ వెంచర్లకు వాడుకుంటున్నారు. రెవిన్యూ అధికారులు కానీ నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూపకపోవడం వెనుక మత్తు లాబు ఏమిటో అర్థం కాని పరిస్థితిలో ఆ శాఖ పనితీరు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు ఈ వెంచర్లపై పూర్తిస్థాయిగా నిఘా పెట్టి రైతులకు న్యాయం చేస్తారని మేధావి వర్గం కోరుతున్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
బాన్సువాడలో రియల్ ఎస్టేట్ దందా బహిరంగం.. అనుమతి లేకుండానే ప్లాట్ల అమ్మకాలు!
బాన్సువాడలో రియల్ ఎస్టేట్ దందా బహిరంగం.. అనుమతి లేకుండానే ప్లాట్ల అమ్మకాలు!

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్