హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
బాన్సువాడలో ప్రశిక్షణ్ అభియాన్ – బి. బి. పాటిల్ పాల్గొన్నారు JH-73770

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘం భవనంలో ఆదివారం పండిత్ దిన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిర్వహించిన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మాజీ ఎంపీ బి. బి. పాటిల్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ బి. బి. పాటిల్ మాట్లాడుతూ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, అంత్యోదయ తత్వం, సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం, గ్రామ స్థాయిలో పార్టీని బలపరచడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి విషయాలపై నాయకులు మార్గనిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేస్తూ క్రమశిక్షణతో పనిచేయాలని, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ, వార్డు స్థాయిలో చురుకుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మనకి బాత్ జిల్లా ఇంచార్జి నరేందర్, పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు చీదరసాలు జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, బిజెపి మున్సిపల్ కౌన్సిలర్లు పాశం ఆమని గజ్జల మహేష్ మాజీ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ మండలాల అధ్యక్షులు హన్మండ్లు యాదవ్, సాయికిరణ్, శ్రీనివాస్ కిషన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి అనిల్ సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ శివశంకర్ బిజెపి నాయకులు చంద్రశేఖర్ గౌడ్ చీకట్ల రాజు పాశం భాస్కర్ రెడ్డి నాగరాజు కొండని గంగారాం శ్యామల శ్రీకాంత్ తోట శంకర్ సాయిబాబా రాజాసింగ్ మహిళా నాయకురాలు రేణుక లక్ష్మి విజయలక్ష్మి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
బాన్సువాడలో ప్రశిక్షణ్ అభియాన్ – బి. బి. పాటిల్ పాల్గొన్నారు
బాన్సువాడలో ప్రశిక్షణ్ అభియాన్ – బి. బి. పాటిల్ పాల్గొన్నారు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్