రాజీ మార్గమే రాజమార్గం: జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం
Published on 28 Mar 2026, 10:12 PM 12
JH-36930
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరిత గతిన పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం జాతీయ లోక్ అదాలతో ఈరోజు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా కామారెడ్డి స్పెషల్ మొబైల్ జడ్జి బి దీక్ష మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్ లో ముఖ్యంగా రాజి పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బోన్స్, మోటర్ వాహన ప్రమాద బీమా, మొదలగు కేసులను ఎరువర్గాల అంగీకారంతో సుమారుగా 50కి పైగా కేసులు ఈ స్పెషల్ మొబైల్ కోర్టు ద్వారా పరిష్కరించబడినవి అని అన్నారు.
ఈ సందర్భంగా మొబైల్ కోర్ట్ లోకదాలత్ బెంచ్ సభ్యులు న్యాయవాది ఎం ఏ సలీం మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఉన్న రాజి పడగల సివిల్ కేసులు, కాంపౌంటింగ్ క్రిమినల్ కేసులు వివిధ కేసులను లోక్ అదాలత్ ద్వారా సులభముగా ఎటువంటి కోర్టు ఖర్చులు లేకుండా పరిష్కరించుకోవచ్చని అన్నారు. కావున కక్షిదారులు, దరఖాస్తుదారులు ఇట్టి లోక్ అదాలత్ లను సద్వినియోగం చేసుకో గలరని కోరినారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు లోక్ అదాలత్ సభ్యులు శ్రీ ఎం ఏ సలీం, శ్రీ సిహెచ్ మురళి, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, కక్షిదారులు, దరఖాస్తుదారులు మొదలవారు పాల్గొన్నారు.
