మాజీ జడ్పీ కో- ఆప్షన్ సభ్యుడు అలీ బిన్ అబ్దుల్లా పరామర్శించిన డిసిసి అధ్యక్షులు
Published on 28 Mar 2026, 10:05 PM 99
JH-66597
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అనారోగ్యంతో ఉన్న మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు అలీ బిన్ అబ్దుల్లా పరామర్శించిన డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ జడ్పీ కో- ఆప్షన్ సభ్యుడు అలీ బిన్ అబ్దుల్లా కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ స్వయంగా నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా అలీ బిన్ అబ్దుల్లా ఆరోగ్య పరిస్థితిని వివరంగా అడిగి తెలుసుకున్న మల్లికార్జున్, ఆయనకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే,ఈ క్లిష్ట సమయంలో పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆసద్,నాయకులు అజాజ్, షాహబ్, అజీమ్, రమేష్, కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
