బాన్సువాడలో సంతల వేలం పాటలు: మేకల సంతకు భారీ ధర.. రూ.48.10 లక్షలు పలికిన వేలం!
Published on 25 Mar 2026, 10:44 PM 40
JH-38417
జనహితం న్యూస్ బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ సంతల నిర్వహణకు సంబంధించి బుధవారం భారీ ఎత్తున వేలం పాటలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలం ప్రక్రియను మున్సిపల్ చైర్మన్ కాసుల విజయ, వైస్ చైర్మన్ ఏజాజ్ రేష్మ బేగం మరియు కౌన్సిలర్లు దగ్గరుండి పర్యవేక్షించారు.
వేలం వివరాలు మరియు దక్కించుకున్న వారు:
మేకల సంత: ఈ వేలంలో అత్యధికంగా మేకల సంత వేలం పాట భారీ ధరకు అమ్ముడైంది. షేక్ ఖదీర్ పాషా రూ. 48.10 లక్షలకు ఈ సంతను దక్కించుకున్నారు.
వారపు సంత: వారపు సంత నిర్వహణ హక్కులను నాటకారి రాజేష్ రూ. 12.51 లక్షలకు పాడుకున్నారు.
రోజువారీ సంత: రోజువారీ సంత వేలం పాటను ప్రీతమ్ రెడ్డి రూ. 9.10 లక్షలకు దక్కించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
