హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు – కామారెడ్డి SP రాజేష్ చంద్ర హెచ్చరిక JH-16458

జనహితం న్యూస్ : కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర IPS సోషల్ మీడియాలో ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసత్య సమాచారం వ్యాప్తి చేయడం వల్ల ప్రజల్లో అనవసర భయం, ఆందోళనలు పెరుగుతాయని ఆయన తెలిపారు.

అలాంటి తప్పుడు వార్తలను నమ్మకుండా అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఎస్పీ సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి అసత్య ప్రచారాన్ని అడ్డుకోవడంలో సహకరించాలని కోరారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు – కామారెడ్డి SP రాజేష్ చంద్ర హెచ్చరిక
ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు – కామారెడ్డి SP రాజేష్ చంద్ర హెచ్చరిక

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్