ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి: షబ్బీర్ అలీకి వినతి
Published on 20 Mar 2026, 06:38 PM 47
JH-16465
జనహితం న్యూస్: కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి నివాసంలో షబ్బీర్ అలీ గారిని కలిసి ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ఆశా వర్కర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, “ఆశా వర్కర్లు ఆరోగ్య రంగానికి వెన్నెముకలాంటివారు. మీ సమస్యలకు మూల కారణం గత ప్రభుత్వం అప్పులు చేసి మా నెత్తి పైన పెట్టాయి అవి సవరించుకుంటూ ముందున్న సమస్యలు తీర్చుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం
గ్రామీణ స్థాయిలో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంలో మీ పాత్ర ఎంతో కీలకం. గర్భిణీ స్త్రీల సంరక్షణ నుంచి చిన్నారుల టీకాల వరకు, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండేలా మీరు నిరంతరం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో మీరు ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందించారు. మీ సేవలను ప్రభుత్వం ఎంతో గౌరవంగా గుర్తిస్తుంది.
మీరు ప్రస్తావించిన సమస్యలు తక్కువ గౌరవ వేతనం, క్రమరహిత చెల్లింపులు, అధిక పనిభారం, ప్రోత్సాహకాలలో జాప్యం వంటి అంశాలు మీ రోజువారీ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మీరు నాకు విన్నవించార.
మీ సమస్యలపై నాకు పూర్తిగా అవగాహన ఉంది. మీరు చేసే పనికి తగిన ప్రతిఫలం అందేలా, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, మీ డిమాండ్లలో ముఖ్యంగా కనీస వేతనం పెంపు, స్థిరమైన వేతన వ్యవస్థ, పింఛన్, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయడం వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుంటాము. ఈ విషయాలను ఆరోగ్య శాఖ మంత్రితో త్వరలోనే చర్చించి, స్పష్టమైన నిర్ణయాలు తీసుకునేలా కృషి చేస్తాను.
అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి, రాష్ట్ర స్థాయిలో పరిష్కారం దిశగా చర్యలు చేపడతాము. అవసరమైతే అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి, చర్చించి మీకు న్యాయం జరిగేలా చేస్తాం.
మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీ డిమాండ్లలో న్యాయమైన మరియు ఆమోదయోగ్యమైన అభిమానులను నెరవేర్చలా చూస్తాను,ఈ సందర్భంగా ఆశా వర్కర్లు షబ్బీర్ అలీ గారికి ధన్యవాదాలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో ఐరేని సందీప్ కుమార్, కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయకులు సిఐటియు గౌరవ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం అరుణ్, దశరథ్ సిఐటియు నాయకులు మరియు భారీ సంఖ్యలో ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
