హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఉగాది పండుగ వేడుక పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి JH-99583

జనహితం న్యూస్ బాన్సువాడ : తెలుగు నూతన సంవత్సరాది "శ్రీ పరాభవ" నామ ఉగాది పండుగ సందర్భంగా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ మరియు బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామాల్లో గల శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు దర్శించుకొన్నారు. అనంతరం తిమ్మాపూర్ ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఉగాది పండుగ వేడుక, పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. దశాబ్దాల తర్వాత శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కొండ చుట్టూ ఉగాది పండుగ సందర్భంగా జరిగే గిరి ప్రదక్షణ పునః ప్రారంభం చేయడం జరిగింది. 

గత కొన్ని దశాబ్దాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ చుట్టూ ఎడ్ల బండ్లతో గిరి ప్రదక్షణ ఉత్సాహంగా జరిగేది, చుట్టూ ప్రక్కన ఉన్న గ్రామాలనుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనేవారు, కాలక్రమేన మరుగున పడింది,తిరిగి ఈరోజు శ్రీ మాధవానంద స్వామి వారి సలహాలు, సూచనలమేరకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పునః ప్రారంభం అయిన గిరి ప్రదక్షణ.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ ఆనందమయంగా ఉండాలని, అద్భుతమైన విజయాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, తెలుగు నూతన సంవత్సర "శ్రీ పరాభవ" నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్టానిక నాయకులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఉగాది పండుగ వేడుక పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఉగాది పండుగ వేడుక పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్