అడూర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
Published on 01 Apr 2026, 06:54 PM 33
JH-38508
జనహితం న్యూస్, కామారెడ్డి: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో... అడూర్ నియోజకవర్గానికి ఏఐసీసీ పరిశీలకులు (AICC Observer ) గా వెళ్లిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వరుసగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు స్థానిక నాయకులతో సమావేశాల్లో పాల్గొంటున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ యొక్క స్థితి గతులను పరిశీలిస్తూ, ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం స్థానిక నాయకులతో కలిసి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఈరోజు అడూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ... యు డి ఎఫ్ ప్రభుత్వ పాలనలో అడూర్ నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చెందలేదని, అన్ని రంగాల్లో వెనుకబాటుతనానికి గురయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు ఆలయాల నుండి వచ్చే ఆదాయంలో కూడా అవినీతికి పాల్పడ్డారని ద్వజమెత్తారు. పేదలు, దళితులు, మైనార్టీలు, మహిళలు ఏ ఒక్కరూ యు డి ఎఫ్ పాలనలో సంతృప్తిగా లేరని పేర్కొన్నారు. అందుకే ఈసారి కేరళ ప్రజలు యు డి ఎఫ్ కు పట్టం కట్టబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాబట్టి అడూర్ నియోజకవర్గ యు డి ఎఫ్ అభ్యర్థి సీవీ శాంత కుమార్ అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
100 కు పైగా సీట్లలో యు డి ఎఫ్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ పార్టీ గెలుపు కోసం శ్రమించాలని చెప్పారు.. పార్టీ కోసం కష్టపడే ప్రతీ ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని తెలిపారు.. రాబోయే రోజుల్లో నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రతీ ఒక్కరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లభిస్తుందని, సామాజిక న్యాయం జరుగుతుందని, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతారని, దేశాన్ని సరైన మార్గంలో నడిపిస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
