విద్య సదస్సును విజయవంతం చేయండి – SGT ఉపాధ్యాయ సంఘం పిలుపు
Published on 27 Mar 2026, 09:54 PM 50
JH-91644
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో SGT ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్ మాట్లాడుతూ... ఆదివారం రోజు రాష్ట్ర స్థాయిల SGT విద్య సదస్సు మెదక్ జిల్లా తూప్రాన్ లో నిర్వహించడం జరుగుతుంది కావున SGT ఉపాధ్యాయ సంఘ నాయకులు మరియు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయగలరు.
ఎస్ జి టి ఉపాధ్యాయులకు టీచర్స్ ఎం ఎల్ సి ఓటు హక్కు కావాలని, 317 GO వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలనీ, CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలనీ, మిగిలి ఉన్న DAలు ఇచ్చి, PRC వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంను డిమాండ్ చేశారు. లేని యెడల ప్రభుత్వంతో న్యాయ పోరాటానికి SGT ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో SGT ఉపాధ్యాయ సంఘం మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి వారి హనుమాన్లు ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, సత్యనారాయణ, దర్శనం పర్వయ్య, తోపారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
